సమర్థ రామదాస స్వామి – సామాజిక సమరసత

శ్రీ సమర్థగురు రామదాస్ (విక్రమ. సం. 1665-1739; క్రీ.శ. 1608-1682)

గురు సమర్ధ రామదాస స్వామి జయంతి (17 ఫిబ్రవరి) సందర్భంగా……

సమర్థగురు రామదాసస్వామి ప్రపంచంలో మహాత్ములైన యోగులలో ఒకరు. మహారాష్ట్రలో `జామ్బ్’ అనే  గోదావరీతట ప్రాంతంలో జన్మించిన వీరు చిన్నతనం నుంచీ శ్రీరామ, శ్రీ ఆంజనేయ భక్తుడు. వివాహ సమయంలో పురోహితుడు ముహూర్త సమయానికి `సావధాన’(జాగ్రత్త) అనగానే లేచి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు.

అఖండ సాధన 

గోదావరీతట `నాసిక’ వద్ద శ్రీ సమర్థగురు పన్నెండు సంవత్సరాల కఠోర సాధన చేసారు. ప్రాతఃకాలం నుంచి మధ్యాహ్నం వరకు గోదావరి నీళ్ళల్లో నుంచుని గాయత్రీ మంత్రజపం చేసేవారు. శ్రీరామనామజపం `శ్రిరామజయరామ జయజయరామ’ మంత్రాన్ని పదమూడుకోట్లసార్లు జపించారు. తర్వాత దేశమంతా తీర్థస్థలాలు పర్యటించారు. పండరీపురంలోనూ ఆయనకు ఆ రాముడే కనిపించాడు. అక్కడే ఆయన భక్త తుకారామ్ ను కూడా కలిసారు. ఆ కాలంలోని దేశ సామాజిక, రాజకీయ, ఆర్ధిక దుస్థితి చూసి ఆయనకు చాలా దుఖం కలిగింది. సాక్షాత్తు శ్రీరాముడే వీర శివాజీకి సహాయం చేయమని ఆదేశించినట్లు ఆయనకు తోచింది.   

కుల,భేదభావాలు

సమాజంలో కుల వైషమ్యాలు, ఒక పెద్ద వర్గం అవమానానికి గురై బాధ పడడం చూసి,  శ్రీ సమర్థగురు రామదాస్ ఎంతో మనస్తాపం చెందారు. ఈ భేదభావాలను సమూలంగా తొలగించడానికి సమాజాన్ని జాగృతం చేసే పనికి ఉపక్రమించారు. ఇదే విషయాన్ని తమ ప్రఖ్యాత `దాసబోధ’ గ్రంథంలో సైద్ధాంతికంగా తెలియచేస్తూ, `పెద్ద- చిన్న, రాజు- పేద, స్త్రీ -పురుష తారతమ్యాలు ఏమీ లేవు, అందరూ ఒకటే, అందరిలోనూ ఒకే పరబ్రహ్మము ఉంటాడు’ అని బోధించారు. `బ్రాహ్మణుడైనా, శూద్రుడైనా, రాజైనా, ప్రజలైనా, అందరిలోనూ పవిత్రమైన పరబ్రహ్మము ఒక్కటే’ అంటూ ఆయన సమస్త మానవులలోనూ ఒకే భగవత్ స్వరూపాన్ని దర్శించి, కుల విభేదాలని తోసిపుచ్చారు. అందరి హృదయాలను సంభాలించడమే దైవభజన అని చెప్పారు. `సంత్ చోఖామేలా’,`వర్కారి సంప్రదాయం’లో (శ్రీ పాండురంగ భక్తి సంప్రదాయం) `మహార్’కులానికి చెందిన స్వామీజీ గురించి వ్రాస్తూ… `అనాథనాథుడైన భగవంతునికి ఏ జాతి లేదు, ఆయన `చోఖామేలా’తో కూర్చుని పాలు, పెరుగు భోజనం చేస్తాడు’ అన్నారు. మరొకచోట వ్రాస్తూ `ఎక్కువ తక్కువ కులాలనే వ్యత్యాసం లేదు. హరినామ సంకీర్తనతో నిండిన అటువంటి వ్యక్తుల పవిత్ర పాదధూళికి నేను నమస్కరిస్తున్నాను’ అన్నారు. `ఇంకొకరి స్పర్శమాత్రం చేత అపవిత్రమైపోతే నీదేపాటి పవిత్రత? పెద్ద-చిన్న కులభేదాలను తోసిపుచ్చి అందరినీ హృదయపూర్వకంగా ప్రేమించండి, ఆదరించండి; అప్పుడే అందరి హృదయాలు పునీతమౌతాయి’ అన్నారు. 

`అంటరానివారి’తో భోజనం, దక్షిణ

చాఫల్ ప్రాంతంలో, భేర్వాడి గ్రామంలోని `అంటరానివాళ్ళు’ అనబడే దంపతులను, శ్రీ సమర్థగురు రామదాస్ తమ శ్రీరామనవమి ప్రవచనాలకు ఆహ్వానించారు. వారు `మాండ్’ నదిలో స్నానం చేసిన తరువాత, సంప్రదాయానుసారం వారిద్దరికీ చీర-ధోవతులు పెట్టి, సహపంక్తి భోజనం కావించి, దక్షిణ సమర్పించారు. ఆ కాలంలో ఈ సంఘటన ఒక గొప్ప విప్లవంగా పేర్కొనవచ్చని డా. సచ్చిదానంద పర్లికర్ తమ పుస్తకంలో వ్రాసారు, `కులం, వర్ణం, ప్రాంతం, భాషా భేదాల పేరుతో, మనుషుల మధ్య  అంతరాలు శ్రీ సమర్థగురు రామదాస్ గారికి ఎంతమాత్రం అంగీకారం కాదు’ అని వ్రాసారు.  శ్రీ సమర్థగురు రామదాస్ అంటారు. `భక్తిమార్గములో వెళ్లే ప్రతి వ్యక్తి పరమాత్మ అనుగ్రహానికి పాత్రుడే, అన్ని వర్ణాలు దీనికి అర్హులే, చిన్నా-పెద్దా ఎవరూ లేరు, మూర్ఖుడైనా భగవంతుడి నామస్మరణతో భవసాగరాన్ని దాటవచ్చు. మంచి పనులు చేసే వ్యక్తి శ్రేష్టుడు, చెడు చేసేవాడు నికృష్టుడు, కర్మానుసారం మనుషులు పాపకర్మలు లేక పుణ్యకార్యాలు చేస్తుంటారు’ అని ఉద్బోధించారు.

దేశోద్ధారణ

ఆ కాలంలో భారతదేశం మీద ఇస్లాంమత దాడులనుంచి దేశాన్ని విముక్తం చేయడానికి శ్రీ సమర్థగురు రామదాస ప్రణాళికాబద్దంగా కృషి చేసారు. పవిత్ర కృష్ణానది ఉద్భవించిన మహాబలేశ్వర్ కొండలలో ఆయన ప్రధమంగా శ్రీ వీరహనుమాన్ దేవాలయం, మఠం నిర్మించారు; ఆ తరువాత 11 క్షేత్రాల్లో శ్రీ ఆంజనేయ దేవాలయాలు, మఠాలు స్థాపించారు. నెమ్మదిగా శ్రీ సమర్థగురు రామదాస్ మహారాష్ట్ర అంతటా వేయి హనుమాన్ మందిరాలు, అఖాడాలు నిర్మించారు.

ఆ కాలంలో పూర్తి దేశమంతా ముస్లింల చేతిలో హిందువులు ఎన్నో భయంకర దాడులకు, అత్యాచారాలకు గురౌతున్నారు. ఎన్నో ప్రాంతాల్లో రాజ్యాధికారం ముస్లిముల చేతిలోనే ఉంది. భక్తి ఉద్యమంతో పాటు, ముస్లిముల చేతుల్లోంచి అధికారం తిరిగి పొందడం కూడా దైవకార్యంగానే శ్రీ సమర్థగురు రామదాస్ భావించారు. `స్వరాజ్యం ధర్మకార్యం. పరమేశ్వరుని శిరసు మీద ధరించి, మన దేశాన్ని సర్వనాశనం చేసిన ముస్లిం రాజుల మీద యుద్ద్ధం ప్రకటించండి, దేశం కోసం ప్రాణాలను అర్పించడానికి వెనుకాడకండి’ అని శ్రీ సమర్థగురు రామదాస్ పిలుపు నిచ్చారు. `హిందూ ఆలయాలను ధ్వంసం చేసినవారు దైవద్రోహులు, అటువంటివారిని శిక్షించిన వారు దేవదాసులు, ఈశ్వరుని భక్తులు; ఈశ్వర భక్తులకి విజయం తధ్యం’.  అని అన్నారు

శ్రీరామనవమి మహోత్సవాలు

హిందూ సమాజాన్ని ఐకమత్యంతో ఒక్కతాటిపై తేవడానికి శ్రీ సమర్థగురు రామదాస్, శ్రీరామనవమి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆనాడు జరిగే  శ్రీరామ రథోత్సవాలలో, అన్ని కులాలు వర్గాలవారు ఎంతో ఉత్సాహంతో పాల్గొనేవారు.  

శిష్య పరంపర

శ్రీ సమర్థగురు రామదాస్ దేశ వ్యాప్తంగా హిందూ సమాజాన్ని జాగృతం చేసి, ఒక్కతాటిపై సమీకరించడానికి కృషి చేసారు. ఆయన తమ విస్తృత శిష్యపరంపర నుంచి, దాదాపు 1100మందిని `మహంత్’లుగా తీర్చిదిద్దారు, అందులో 300మంది మహిళలు, ఆనాటి సమాజంలో అది చాలా పెద్ద సంస్కరణ, ముందడుగు. వీరంతా దేశమంతా విస్తరించి, అనేక స్థానాల్లో, హిందూ సమాజాన్ని ఏకీకృతం చేసే పని నిర్వహించారు. వీరు కులాలకి అతీతంగా వేయి పైగా మఠాల స్థాపన చేసారు. తంజావూరు నుంచి కాశ్మీరు దాకా వ్యాపించిన ఈ మఠాలు, అఖాడాలు, ఛత్రపతి శివాజీ మహారాజుకి ఎంతో సహకారం అందించాయి. శివాజీ మహారాజు పుత్రుడు శ్రీ రాజారాం మహారాష్ట్ర విడిచి దక్షిణ భారతానికి వచ్చినపుడు, తంజావూరు మఠం ఆయనకు సర్వంసహా మద్దతు ఇచ్చినందువల్ల ఆయన ఇరవై సంవత్సరాల పాటు ఔరంగజేబుతో యుద్ధం చేయగలిగారు.

సాహిత్య రచనలు

హిందూ సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీ సమర్థగురు రామదాస్ అనేక ఉత్కృష్ట రచనలు చేసారు. అందులో ప్రముఖమైనవి- `దాసబోధ’ `కరుణాష్టక్’ `మనాచే శ్లోక్’ `సుందరకాండ మరియు యుద్ధకాండ’. వేలాదిమంది కార్యకర్తలను సుశిక్షితులుగా తయారుచేసి, సామాజికంగా సంఘటితం చేయడానికి ఎనలేని కృషి చేసారు. `అందరి హృదయాలలో శ్రీరాముడు నివాసముంటాడు, కులభేదాలు పట్టుకువేళ్ళాడడం అంటే మనందరిలోని శ్రీరాముడి అస్తిత్వాన్ని నిరాకరంచడమే’ అన్నారు.  వెనకబడిన కులాలనబడే వారితో పనిచేసి, వారిని సంఘటితం చేసి ఛత్రపతి శివాజీ మహారాజుకి తోడుగా తెచ్చి నిలబెట్టారు.

 (`భారత్ కీ సంత్ పరంపర ఔర్ సమాజిక్ సమరసతా’ హిందీ గ్రంథం ఆధారంగా)

–  శ్రీ కృష్ణ గోపాల్ శర్మ

అనువాదం: ప్రదక్షిణ

RSS NEWS

 • 16వేల ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేసిన చైనా
  చైనాలోని షిన్‌జియాంగ్‌ ప్రాంతంలో మైనారిటీలను నిర్భంధ క్యాంపుల్లో ఉంచుతూ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందనే ఆరోపణలున్న విషయం తెలిసిందే. తాజాగా అక్కడ దాదాపు 16 వేల ముస్లిం ప్రార్థనా మందిరాలను కూల్చివేసినట్లు ఆస్ట్రేలియా నిపుణుల బృందం ఒకటి బయటపెట్టింది. షిన్‌జియాంగ్‌ ప్రావిన్సులోని వీగర్‌ తెగకు చెందిన ముస్లింలను నిర్భంధిస్తున్నట్లు చైనా ప్రభుత్వంపై ఇప్పటికే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా వారి సంప్రదాయల నుంచి దూరం చేయాలనే లక్ష్యంతోనే ఇలా నిర్భంధానికి గురి చేస్తుందనే వాదన కూడా ఉంది. తాజాగా విడుదలైన […]
 • సక్షమ్ ఆధ్వర్యంలో నేత్రదాన ప్రతిజ్ఞలు
  దేశవ్యాప్తంగా నేత్రదానం చేసే వారి సంఖ్యను పెంచేందుకు, సక్షమ్ ఆధ్వర్యంలో కాంబా ( కార్నియా అంధత్వ ముక్త్ భారత్ అభియాన్) అనే పేరుతో నేత్ర దాన ప్రతిజ్ఞల కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా సక్షమ్ హైదరాబాద్  శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 4 వరకు 3 లక్షల నేత్ర దాన ప్రతిజ్ఞలు చేయించాలని లక్ష్యం నిర్ణయించుకుంది. అక్టోబర్ 8న దేశ వ్యాప్తంగా అత్యధిక ప్రతిజ్ఞలు సేకరించిన ఎన్జీవో లను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించనున్నారు.దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రధాని […]
 • నిందితుల మతం ఆధారాంగా ప్రాసిక్యూషన్ ఎలా ఉపసంహరించుకుంటారు?: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర వ్యాఖలు
  మతం ఆధారంగా ప్రాసిక్యూషన్ను ఉపసంహరించుకోవడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్య ప్రజా ప్రయోజనానికి విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ దాఖలు చేసిన పిల్ పై చేసిన విచారణ సమయంలో స్పష్టం చేసింది. మే 2018 లో పాత గుంటూరు పోలీస్ స్టేషన్ కొందరు ముస్లిం యువత దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు నమోదైన 6 ఎఫ్ఐఆర్ లపై విచారణ ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 12న జీవో జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ  […]
 • శ్రద్ధాంజలి
  పద్మ భూషణ్ పురస్కార గ్రహీత, అద్భుత గాయకుడు శ్రీ పతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం గారి మరణంతో దేశం ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయింది. పదహారుకు పైగా భారతీయ భాషలలో దాదాపు నలభై వేల పాటలు పాడి గాన గంధర్వుడిగా పేరు పొందారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు తగిన ధైర్యం కలుగజేయాలనీ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. – బూర్ల దక్షిణామూర్తి, తెలంగాణ ప్రాంత సంఘచాలక్ , రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ The post శ్రద్ధాంజలి […]
 • విద్యా భారతి ఆధ్వర్యంలో వివిధ అంశాలపై పోటీలు
  విద్యా భారతి, కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మరియు MyNEP ల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో వివిధ పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఈ పోటీలు మూడు కేటగిరీల లో నిర్వహించబడతాయి. మొదటి కేటగిరీ తొమ్మిదో తరగతి నుండి 12వ తరగతి విద్యార్థులకు, రెండో కేటగిరీ యూజీ మరియు పీజీ విద్యార్థులకు, మూడోది ఇది సామాన్య ప్రజలకు. మొత్తం తెలుగుతోపాటు పదమూడు భాషలలో నిర్వహించబడు ఈ పోటీలలో ప్రతి అంశంలో భాష వారిగా మొదటి బహుమతిగా పదివేల రూపాయలు, రెండవ బహుమతిగా […]
 • జమ్మూకాశ్మీర్ లో  కోవిడ్ సేవా కార్యక్రమాలు
  కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో నూతనంగా ఏర్పడ్డ  కేంద్రపాలిత ప్రాంతాలు జమ్ము కాశ్మీర్, లడఖ్ లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కార్యకర్తలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మార్చి 25 నుండి కొవిడ్-19 నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టి అనేక మందికి అండగా నిలిచారు. జమ్ము కాశ్మీర్, లడక్ లోని 2,995 ప్రదేశాల్లో దాదాపు 4,725 మంది స్వయం సేవకులు ఈ విపత్కర సమయంలో మానవాళికి సేవ చేయడానికి ముందుకు వచ్చారు. కరోనా నేపథ్యంలో  […]
 • నూతన విద్యావిధానంపై క్రైస్తవ పాఠశాలల దుష్ప్రచారం
  తమిళనాడులోని తిరునల్వేలిలోని ప్రభుత్వ ఎయిడెడ్  క్రైస్తవ పాఠశాలలు తమ విద్యార్థులను నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని ఒత్తిడి తెస్తున్న విషయాన్ని విశ్వహిందూ పరిషద్ వెలుగులోకి వచ్చింది. తిరునల్వేలి జిల్లాలో కొన్ని ప్రభుత్వ ఎయిడెడ్ క్రైస్తవ మిషనరీ పాఠశాలలు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇగ్నేషియస్, లయోలా కాన్వెంట్ పాఠశాలల యాజమాన్యం నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ తమ […]
 • విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి కీలక సవరణలు: పార్లమెంటులో బిల్లు ఆమోదం
  విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి కీలక సవరణలు చేస్తూ ప్రతిపాదించిన బిల్లు మంగళవారం పార్లమెంటులో ఆమోదం పొందింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్టుగా వ్యవహిరించే ఈ చట్టం ద్వారా లైసెన్సులు పొందిన సంస్థలు విదేశాల నుండి విరాళాలు స్వీకరించేందుకు అనుమతి ఉంటుంది. అయితే విదేశాల నుండి విరాళాలు పొందుతున్న అనేక సంస్థలు నిర్ధేశిత లక్ష్యం కోసం వీటిని ఖర్చు చేయకపోవడం, ఎక్కువమొత్తం ధనం సంస్థల ఖాతాల్లో నిలువలుగా ఉండటం మొదలైన వాటిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ సవరణలు తీసుకువచ్చింది.       విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ప్రకారం ఒక ప్రాజెక్ట్ లేదా లక్ష్యం కోసం […]
 • ఇజ్రాయిల్ లో భారతీయ సైనికుల వీరోచిత పోరాటం – హైఫా యుద్ధం
  సెప్టెంబర్‌ 22,23, 1918న జరిగిన హైఫా యుద్ధం ప్రపంచ చరిత్రలోనే అపూర్వమైనది. స్వతంత్ర ఇజ్రాయిల్‌ ఏర్పాటుకు ఈ యుద్ధమే పునాది వేసింది. జోధ్‌పూర్‌ మహారాజా, మైసూర్‌ మహారాజా పంపిన అనేకమంది భారతీయ సైనికులు మొదటి ప్రపంచయుద్ధంలో ఇజ్రాయిల్‌ (వెస్ట్‌ బ్యాంక్‌)లో ప్రాణత్యాగం చేశారు. టర్కులు, జర్మన్లు, ఆస్ట్రియన్లతో కూడిన సంయుక్త సేనను ఓడించి ఇజ్రాయిల్‌ రేవు పట్టణం హైఫాను సెప్టెంబర్‌, 1918లో విముక్తం చేశారు. ఇజ్రాయిల్‌ను అప్పట్లో పాలస్తీనాగా పిలిచేవారు. 1516 నుండి 402 ఏళ్ళపాటు ఇది […]
 • తిరువనంతపురంలో ఇద్దరు తీవ్రవాదులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
  కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో షోయబ్, గుల్ నవాజ్ అనే ఇద్దరు ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం సాయంత్రం అరెస్టు చేసింది. నివేదికల ప్రకారం.. కేరళ రాష్ట్రానికి చెందిన షోయబ్ 2018లో బెంగుళూరు వరుస పేలుళ్ల కేసులో నిందితుడు. అప్పటి నుండి అతను పరారీలో ఉన్నాడు. అతను ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలు కీలక సభ్యుడు. గుల్ నవాజ్ అనే మరొక ఉగ్రవాది పాకిస్థాన్ కు చెందిన లష్కరే తోయిబా లో చెందిన సభ్యుడు. […]
%d bloggers like this: