RSS NEWS

 • అక్రమ చర్చి నిర్మాణం విషయంలో ఉదాసీనత: అధికారులపై ఎన్.హెచ్.ఆర్.సికి గ్రామస్థుల ఫిర్యాదు 
  ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా దొరసానిపల్లి గ్రామంలో కొందరు క్రైస్తవ పాస్టర్లు అక్రమంగా చర్చి నిర్మించేందుకు ఆ ప్రాంతంలో నివసిస్తున్న షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారి ఇళ్లను ఖాళీ చేయించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్, కడప జిల్లా కలెక్టర్ను సంప్రదించి అట్టడుగు వర్గాల కుటుంబాలపై చర్చి పాస్టర్లు చేసిన దౌర్జపై చర్యలు తీసుకోవాలని, చర్చి నిర్మాణాన్ని ఆపి వేయాలని కోరారు. దీంతో అక్కడ […]
 • ఏపీలో క్రైస్తవ మతమార్పిళ్ల అంశంలో ఎల్.ఆర్.పి.ఎఫ్ నివేదికపై రాష్ట్రపతి భవన్ స్పందన
  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీఎత్తున జరుగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లు, ఎస్సీ రిజర్వేషన్ల దుర్వినియోగం, తప్పుదోవ పట్టించే జనాభా లెక్కలు మొదలైన అంశాలపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సమర్పించిన సమగ్ర నివేదికపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. దీనిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి సూచించింది. దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లు, పొంచివున్న ప్రమాద ఘంటికలపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సమర్పించిన నివేదికలో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో […]
 • దేశం కోసం ఒక విద్యార్థి ఉద్యమం: మాతృభూమి సేవలో 72 సంవత్సరాలు
  ఎక్కడ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉందో… అక్కడ దేశభక్తి ఉంటుంది. ఈనాడు విద్యార్థి పరిషత్ (ABVP) పని దేశంలోని మారుమూల ప్రాంతాలలో సహితం వ్యాపించింది. విద్యార్థి పరిషత్ కార్యకర్తలు “భారత్ మాతా కీ జై”, “వందేమాతరం” అంటూ నినదిస్తూనే ఉంటారు. ఇవి వారికి నినాదాలే కాదు జీవన నిష్ఠ కూడా. ఈ కారణంగానే ఎక్కడైతే విద్యార్థి పరిషత్ అడుగిడిందో అక్కడి వారిలో జాతీయ భావం ప్రబలంగా పెరిగింది. అంతేకాక అంతర్జాతీయ మరియు దేశానికి విఘాతం కలిగించే […]
 • కరోనా టీకా పరీక్షకు సిద్ధం: విశ్వహిందూ పరిషత్ సంయుక్త ప్రధాన కార్యదర్శి ప్రకటన 
  ప్రపంచ మానవాళిని వణికిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టే వాక్సిన్ (టీకా) కనిపెట్టేందుకు వివిధ దేశాలు తీవ్రంగా పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో భారతదేశానికి చెందిన ఫార్మాసూటికల్ కంపెనీ ‘భారత్ బయోటెక్’ కోవాక్సీన్ పేరిట ఒక వాక్సిన్ అభివృద్ధి చేసింది. ఈ కోవాక్సీన్ పై క్లీనికల్ ట్రయల్స్ (మానవ శరీరంపై ప్రయోగం) జరిపేందుకు భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ భారత్ బయోటెక్ సంస్థకు అనుమతి మంజూరు చేసింది. ఈ క్రమంలో ఈ వాక్సిన్ ప్రయోగం కోసం తాను ముందుకు రావడానికి సిద్ధమని విశ్వహిందూ పరిషత్ సంయుక్త ప్రధాన కార్యదర్శి, డాక్టర్ శ్రీ సురేందర్ జైన్ ప్రకటించారు. ఈమేరకు రోహతక్ లోని […]
 • 11 రోజుల్లో వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మించిన రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఓ)
  • ఐసీయూ గదులు, ఏసి వసతులతో ఆసుపత్రి నిర్మాణం • వెంటిలేటర్ వార్డుకి కల్నల్ సంతోష్ బాబు పేరు ఢిల్లీలోని విమానాశ్రయానికి సమీపంలో ఉన్న వైమానిక దళ స్థావరం వద్ద  రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఓ) 250 ఐసియూ గదులతో కూడిన వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించారు. టాటా సన్స్ సంస్థ సహాయంతో నిర్మించిన ఈ ఆస్పత్రిలో సాయుధ దళాలకు చెందిన వైద్య సిబ్బంది వైద్యసేవలు అందిస్తారు. ఢిల్లీ కంటోన్మెంట్ లో  సర్దార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్-19 […]
 • స్వదేశీ  అంటే శాంతి, శ్రేయస్సు, భద్రతను రక్షించే ఒక గొప్ప తపస్సు: ఆర్.ఎస్.ఎస్ సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య  
  స్వదేశీ అనేది ఒక నినాదం లేదా కేవలం ప్రచారం కాదని, ఇది శాంతి, శ్రేయస్సు మరియు భద్రతను ప్రోత్సహిస్తూ, పర్యవరణాన్ని రక్షించే ఒక గొప్ప తపస్సు అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  మాననీయ సహ సర్ కార్యవాహ శ్రీ వి.భాగయ్య జీ అన్నారు. 30 జూన్ న హైదరాబాద్ లోని సంఘ కార్యాలయంలో స్వదేశీ స్వావలంబన్ అభియాన్ సమన్వయకర్త శ్రీ సతీష్ కుమార్ వ్రాసిన పుస్తకాలు ‘స్వదేశీ స్వావలంబన్ కి ఓర్  భారత్’ (హిందీ) మరియు ‘ఇండియా మార్చింగ్ […]
 • సకల కళానిధియై వేదములను విభజించిన విద్యావేత్త సద్గురువు వేదవ్యాసుడు
  –పి. విశాలాక్షి గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరఃగురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః మన భారతదేశం ఆదినుంచీ వేదాలనే ప్రమాణంగా, సూర్య, ఇతర గ్రహచలనం వల్ల జరిగే కష్ట నష్టాలకు విరుగుడుగా ప్రతి జీవి తన అభివృద్ధికి దోహదం చేసే కొన్ని సూత్రాలను ఆచరించి చూపే మహర్షులకు ఆటపట్టు. ఆషాఢ మాసంలో ఏకాదశి నుండి మహర్షులు చాతుర్మాస్య వ్రతం చేస్తూ, ఒకే ప్రదేశంలో నాలుగు నెలలూ ఉండి, ప్రజలను తమ వాక్సుధా రసంతో ఆధ్యాత్మికంగా ముందుకు […]
 • మన్యం విప్లవం.. మహోద్యమం.. అల్లూరి సీతారామరాజు
  బ్రిటిష్‌ దమనకాండకి వ్యతిరేకంగా కొండకోనలలో అడవిబిడ్డలు చేసిన త్యాగాలనీ, రక్త తర్పణలనీ గౌరవించినప్పుడు భారత స్వాతంత్య్ర పోరాటం మరింత మహోన్నతంగా, మహోజ్వలంగా దర్శనమిస్తుంది. వింధ్య పర్వతాలకు ఆవల బ్రిటిష్‌ వ్యతిరేక నినాదాలతో ప్రతిధ్వనించిన కొండలూ, అడవులూ ఎక్కువే. దక్షిణ భారతదేశంలో మాత్రం అంత ఖ్యాతి ఉన్న గిరిజనోద్యమం విశాఖ మన్యంలోనే జరిగింది. ఆ మహోద్యమానికి నాయకుడు అల్లూరి శ్రీరామరాజు (జూలై 4, 1897 – మే 7, 1924). శ్రీరామరాజు ఉద్యమానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 1745 […]
 • సరిహద్దు ప్రాంతాల్లో ప్రధాని ఆకస్మిక పర్యటన
  భారత, చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తారస్థాయిలో ఉన్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు సరిహద్దు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన చేశారు. ఉదయం లేహ్ ప్రాంతానికి చేరుకున్న ప్రధాని అక్కడ నుంచి సరిహద్దుకు వెళ్లారు. సరిహద్దులో ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ITBP) దళాలతో పాటు సైనికాధికారులతో సమావేశమయ్యారు. సరిహద్దులో పరిస్థితులు, చైనా సైనికాధికారులతో చర్చల గురించి ప్రధాని మోదీ తెలుసుకున్నారు. దేశ రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఈ ప్రాంతంలో […]
 • ఛత్తీస్గఢ్ : మావోయిస్టు అగ్రనేతల కీలక సమావేశం
  ఛత్తీస్ గఢ్  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నక్సలైట్లు, మావోయిస్టుల కార్యకలాపాలు మళ్ళీ  పెరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మావోయిస్టులకు కొత్త ఉత్సాహం వచ్చినట్టు అనిపిస్తోంది. ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు,  నక్సలైట్ల అగ్రనాయకుల సమావేశం జరుగుతున్నట్లు  తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీస్ అధికారులకు తెలిసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. సమావేశంలో సిపిఐ (ఎంఎల్)కేంద్ర కమిటీకి చెందిన మావోయిస్టు అగ్ర నాయకులు ఉన్నారని ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. ఈ […]