Vidyadhara Buddhiraju

RSS NEWS

 • సక్షమ్ ఆధ్వర్యంలో నేత్రదాన ప్రతిజ్ఞలు
  దేశవ్యాప్తంగా నేత్రదానం చేసే వారి సంఖ్యను పెంచేందుకు, సక్షమ్ ఆధ్వర్యంలో కాంబా ( కార్నియా అంధత్వ ముక్త్ భారత్ అభియాన్) అనే పేరుతో నేత్ర దాన ప్రతిజ్ఞల కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా సక్షమ్ హైదరాబాద్  శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 4 వరకు 3 లక్షల నేత్ర దాన ప్రతిజ్ఞలు చేయించాలని లక్ష్యం నిర్ణయించుకుంది. అక్టోబర్ 8న దేశ వ్యాప్తంగా అత్యధిక ప్రతిజ్ఞలు సేకరించిన ఎన్జీవో లను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించనున్నారు.దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రధాని […]
 • మతం ఆధారంగా ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకోవడం అభ్యంతరకరం : ఏపీ హైకోర్టు
  మతం ఆధారంగా ప్రాసిక్యూషన్ ను ఉపసంహరించుకోవడం ప్రజా ప్రయోజనానికి విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం ఆదేశాలు జారీ చేసింది. మే 2018 లో గుంటూరు పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన ముస్లిం యువకులపై నమోదైన 6 ఎఫ్ఐఆర్ ల విచారణ ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 12న జారీ చేసిన  జీవో నెంబర్ 786 ను సవాలు చేస్తూ  లీగల్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం కి చెందిన సభ్యుడు పసుపులేటి […]
 • శ్రద్ధాంజలి
  పద్మ భూషణ్ పురస్కార గ్రహీత, అద్భుత గాయకుడు శ్రీ పతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం గారి మరణంతో దేశం ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయింది. పదహారుకు పైగా భారతీయ భాషలలో దాదాపు నలభై వేల పాటలు పాడి గాన గంధర్వుడిగా పేరు పొందారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు తగిన ధైర్యం కలుగజేయాలనీ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. – బూర్ల దక్షిణామూర్తి, తెలంగాణ ప్రాంత సంఘచాలక్ , రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ The post శ్రద్ధాంజలి […]
 • విద్యా భారతి ఆధ్వర్యంలో వివిధ అంశాలపై పోటీలు
  విద్యా భారతి, కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మరియు MyNEP ల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో వివిధ పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఈ పోటీలు మూడు కేటగిరీల లో నిర్వహించబడతాయి. మొదటి కేటగిరీ తొమ్మిదో తరగతి నుండి 12వ తరగతి విద్యార్థులకు, రెండో కేటగిరీ యూజీ మరియు పీజీ విద్యార్థులకు, మూడోది ఇది సామాన్య ప్రజలకు. మొత్తం తెలుగుతోపాటు పదమూడు భాషలలో నిర్వహించబడు ఈ పోటీలలో ప్రతి అంశంలో భాష వారిగా మొదటి బహుమతిగా పదివేల రూపాయలు, రెండవ బహుమతిగా […]
 • జమ్మూకాశ్మీర్ లో  కోవిడ్ సేవా కార్యక్రమాలు
  కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో నూతనంగా ఏర్పడ్డ  కేంద్రపాలిత ప్రాంతాలు జమ్ము కాశ్మీర్, లడఖ్ లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కార్యకర్తలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మార్చి 25 నుండి కొవిడ్-19 నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టి అనేక మందికి అండగా నిలిచారు. జమ్ము కాశ్మీర్, లడక్ లోని 2,995 ప్రదేశాల్లో దాదాపు 4,725 మంది స్వయం సేవకులు ఈ విపత్కర సమయంలో మానవాళికి సేవ చేయడానికి ముందుకు వచ్చారు. కరోనా నేపథ్యంలో  […]
 • నూతన విద్యావిధానంపై క్రైస్తవ పాఠశాలల దుష్ప్రచారం
  తమిళనాడులోని తిరునల్వేలిలోని ప్రభుత్వ ఎయిడెడ్  క్రైస్తవ పాఠశాలలు తమ విద్యార్థులను నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని ఒత్తిడి తెస్తున్న విషయాన్ని విశ్వహిందూ పరిషద్ వెలుగులోకి వచ్చింది. తిరునల్వేలి జిల్లాలో కొన్ని ప్రభుత్వ ఎయిడెడ్ క్రైస్తవ మిషనరీ పాఠశాలలు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇగ్నేషియస్, లయోలా కాన్వెంట్ పాఠశాలల యాజమాన్యం నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ తమ […]
 • విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి కీలక సవరణలు: పార్లమెంటులో బిల్లు ఆమోదం
  విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి కీలక సవరణలు చేస్తూ ప్రతిపాదించిన బిల్లు మంగళవారం పార్లమెంటులో ఆమోదం పొందింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్టుగా వ్యవహిరించే ఈ చట్టం ద్వారా లైసెన్సులు పొందిన సంస్థలు విదేశాల నుండి విరాళాలు స్వీకరించేందుకు అనుమతి ఉంటుంది. అయితే విదేశాల నుండి విరాళాలు పొందుతున్న అనేక సంస్థలు నిర్ధేశిత లక్ష్యం కోసం వీటిని ఖర్చు చేయకపోవడం, ఎక్కువమొత్తం ధనం సంస్థల ఖాతాల్లో నిలువలుగా ఉండటం మొదలైన వాటిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ సవరణలు తీసుకువచ్చింది.       విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ప్రకారం ఒక ప్రాజెక్ట్ లేదా లక్ష్యం కోసం […]
 • ఇజ్రాయిల్ లో భారతీయ సైనికుల వీరోచిత పోరాటం – హైఫా యుద్ధం
  సెప్టెంబర్‌ 22,23, 1918న జరిగిన హైఫా యుద్ధం ప్రపంచ చరిత్రలోనే అపూర్వమైనది. స్వతంత్ర ఇజ్రాయిల్‌ ఏర్పాటుకు ఈ యుద్ధమే పునాది వేసింది. జోధ్‌పూర్‌ మహారాజా, మైసూర్‌ మహారాజా పంపిన అనేకమంది భారతీయ సైనికులు మొదటి ప్రపంచయుద్ధంలో ఇజ్రాయిల్‌ (వెస్ట్‌ బ్యాంక్‌)లో ప్రాణత్యాగం చేశారు. టర్కులు, జర్మన్లు, ఆస్ట్రియన్లతో కూడిన సంయుక్త సేనను ఓడించి ఇజ్రాయిల్‌ రేవు పట్టణం హైఫాను సెప్టెంబర్‌, 1918లో విముక్తం చేశారు. ఇజ్రాయిల్‌ను అప్పట్లో పాలస్తీనాగా పిలిచేవారు. 1516 నుండి 402 ఏళ్ళపాటు ఇది […]
 • తిరువనంతపురంలో ఇద్దరు తీవ్రవాదులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
  కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో షోయబ్, గుల్ నవాజ్ అనే ఇద్దరు ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం సాయంత్రం అరెస్టు చేసింది. నివేదికల ప్రకారం.. కేరళ రాష్ట్రానికి చెందిన షోయబ్ 2018లో బెంగుళూరు వరుస పేలుళ్ల కేసులో నిందితుడు. అప్పటి నుండి అతను పరారీలో ఉన్నాడు. అతను ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలు కీలక సభ్యుడు. గుల్ నవాజ్ అనే మరొక ఉగ్రవాది పాకిస్థాన్ కు చెందిన లష్కరే తోయిబా లో చెందిన సభ్యుడు. […]
 • అయోధ్యా లో కట్టేది బాబ్రీ మసీదు కాదు –  ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ 
  సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలంలో నిర్మించే మసీదుకు బాబర్ పేరు పెట్టబోవడం లేదని, అది బాబ్రీ మసీదు కాబోదని మసీదు నిర్మాణం కోసం ఉత్తర్ ప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ ఏర్పాటు చేసిన ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ స్పష్టం చేసింది. అయోధ్యలో నిర్మించనున్న మసీదు నిర్మాణం మక్కా లోని కాబా మాదిరిగా ఉండనుందని  అధికారికంగా వెల్లడించింది. దీనికి ఏ రాజు లేదా చక్రవర్తి పేరు కూడా పెట్టడం లేదని, దీనిని ధన్నిపూర్ మసీదు అని పిలవాలని తన వ్యక్తిగత అభిప్రాయమని ఫౌండేషన్ ప్రతినిధి  హుస్సేన్ అన్నారు.  కొత్త […]